దేశంలో గ్యాస్‌ ‌కొరత లేదు

– ప్యానిక్‌ ‌బుకింగ్స్ అవసరం లేదు
– కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూదిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ’ప్యానిక్‌ ‌బుకింగ్‌’ అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా పైపుల ద్వారా సహజ వాయివు , కంప్రెస్డ్ ‌నేచురల్‌ ‌గ్యాస్‌  ‌సరఫరాకు భరోసా ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్‌లు, హాస్టల్స్‌కు ఎల్‌పీజీ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మార్చి 2026తో పోల్చుకుంటే దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, అదనంగా రాష్ట్రాల‌కు 48,000 కిలోలీటర్ల (సుమారు 48 మిలియన్‌ ‌లీటర్లు) కిరోసిన్‌ ‌పంపిణీ చేశామని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోల్‌ ఇం‌డియాను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్దానికి ముందు యావరేజ్‌గా 55.7 లక్షల బుకింగ్‌లు ఉంటే మార్చి 12 నాటికి అది 75.7 లక్షలకు పెరిగిందని, భయాల కారణంగానే బుకింగ్‌లు అనూహ్యంగా పెరిగాయని సుజాతా శర్మ తెలిపారు. ఎల్పీజీపై ఒత్తిడి తగ్గేందుకు పీఎన్‌జీ కనెక్షన్లకు మళ్లాలని ప్రజలను కోరారు. క్రూడాయిల్‌కు సంబంధించి 258 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల కెపాసిటీ మనకు ఉందని, పెట్రోల్‌, ‌డీజిల్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని వివరించారు. ప్రధానమైన అర్బన్‌ ‌సిటీలు, కేంద్రాల్లో కమర్షియల్‌ ‌వినియోగదారుల ఆందోళన, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కమర్షియల్‌ ‌వినియోగదారులు స్థానిక సీజీడీ (సిటీ గ్యాస్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌) ‌నెట్‌వర్క్ ‌ప్రొవైడర్‌ను కానీ, సంబంధిత డీలర్‌ను కానీ సంప్రదించి పీఎన్‌జీ కనెక్షన్‌ ‌పొందవచ్చని సూచించారు. దేశంలోని అన్ని పెట్రోల్‌ ‌పంపుల్లో తగినన్ని పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌నిల్వలు ఉన్నాయని, బంక్‌లు ఖాళీ అయినట్టు 25,000 డిస్ట్రిబ్యూటర్లలో ఏ ఒక్కరి నుంచీ తమకు సమాచారం లేదని సుజాతా శర్మ తెలిపారు. వదంతులను విశ్వసించవద్దని, ప్యానిక్‌ ‌బైయింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేంద్రం మార్గదర్శకాలకునుగుణంగా చర్యలు :మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నెలకొన్న ఇంధన, గ్యాస్‌ ‌సరఫరా పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా గ్యాస్‌ ‌సరఫరాను క్రమబద్ధీకరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్‌ ‌సరఫరా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని గుర్తు చేస్తూ.. ప్రస్తుత పరిస్థితులపై మంత్రి ఉత్తమ్‌ ‌పలు కీలక వివరాలను వెల్లడించారు. మార్కెట్‌లో కొంత మేర గ్యాస్‌ ‌కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, దానికి అనుగుణంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. గ్యాస్‌ ‌ప్రొడక్షన్‌ను పెంచామని కేంద్రం తెలిపిందని, ఈ నేపథ్యంలో ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.తెలంగాణ రాష్ట్రానికి 1740 కిలో లీటర్ల కిరోసిన్‌ ‌సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సివిల్‌ ‌సప్లై కమిషనర్‌, ‌పోలీస్‌ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ, వైద్య అధికారులు, చ‌మురు కంపెనీ ప్రతినిధులతో కూడిన కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయి. హైదరాబాద్‌లోని సివిల్‌ ‌సప్లై కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ను ఏర్పాటు చేసి, సరఫరాలో అంతరాయాలను నివారిస్తున్నారు. తమను కూడా అత్యవసర సేవల కింద గుర్తించి సిలిండర్లు సరఫరా చేయాలని హోటల్‌, ‌రెస్టారెంట్‌ ‌యజమానులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి హా ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసర సేవలకు గ్యాస్‌ ‌కొరత లేకుండా చూసే పూర్తి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఉత్తమ్‌ ‌చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *