– ప్రజలు ఆందోళనకు గురి కావద్దు
– పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26 :రాష్ట్రంలో ఇంధన నిల్వలు ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ బుధవారం 2,123 ట్యాంకర్స్ పెట్రోల్ సరఫరా చేశామన్నారు. అలాగే 10,799 లీటర్లు సరఫరా చేశారని వివరించారు. యావరేజ్‌గా 5,883 లీటర్ల పెట్రోల్ వినియోగం ఉంటే.. బుధవారం ఒక్క రోజే 84 శాతం అధికంగా పెట్రోల్ సరఫరా చేశారని చెప్పారు. 22,127 కిలో లీటర్ల డీజిల్ ఆయిల్ కంపెనీలు సరఫరా చేశాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ 596 అవుట్ లెట్స్ ఉన్నాయని అన్నారు. ప్రతీ బంక్‌లో పౌరసరఫరా, సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం పరిశీలన చేస్తుందని తెలిపారు. బుధవారం కంటే.. గురువారం పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిందన్నారు. రాష్ట్రంలో గృహ వినియోగంలో 1,28,24,087 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని.. ప్రతీ రోజు 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఒక్క రోజే 2,19,980 సిలిండర్లు సరఫరా చేశామన్నారు. వినియోగదారులు అధికంగా బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. అలాగే 1,03,275 పైప్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. 2,78,418 క్యూబిక్ విÖటర్లు సరఫరా చేస్తున్నారని తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు పీఎన్జీ, సీఎన్జీని విస్తరించాల్సి ఉందని చెప్పారు. 24 గంటల్లో ప్లాంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





