ఇస్లాంలో బలిదానానికి తావు లేదు

– ఉమర్‌ది ముమ్మాటికీ ఉగ్రవాదమే
– ‘ఎక్స్’ ‌వేదికగా తీవ్రంగా ఖండించిన ఓవైసీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఎ‌ర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ ‌నబీకి  చెందిన వెలుగులోకి వొచ్చిన వీడియోలో ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ అతడు మాట్లాడాడు. అయితే ఉమర్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం ఘోరమైన పాపమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ ‌వేదికగా పోస్టు పెట్టారు. ‘దిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్‌ ‌నబీ ఆత్మాహుతి బాంబు దాడిని సమర్థిస్తున్న వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. సూసైడ్‌ ‌బాంబింగ్‌ ‌గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు అభివర్ణించాడు. అయితే ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం ఘోరమైన పాపం. ఇలాంటి చర్యలు దేశ చట్టాలకు కూడా పూర్తి విరుద్ధం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఇది ముమ్మాటికే ఉగ్రవాదమే’ అని ఒవైసీ పేర్కొన్నారు. మరోవైపు దేశ రాజధాని సమీపంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, దిల్లీ పేలుడుతో ముడిపడి ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌పై ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ’గత ఆరు నెలల్లో స్థానిక కశ్మీరీలు ఎవరూ ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని ఆపరేషన్‌ ‌సిందూర్‌, ‌మహదేవ్‌ ‌సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా పార్లమెంటుకు తెలిపారు. మరి ఈ గ్రూపు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆయన నిలదీశారు. ప్రస్తుతం ఒవైసీ ట్వీట్‌ ‌వైరల్‌ అవుతోంది.
కశ్మీర్‌కు చెందిన కొందరు వైద్యుల మాటున ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ నెల 10న దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సపంలోని మెట్రో స్టేషన్‌ ‌వద్ద కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 15 మంది మరణించారు. ఇక ఈ పేలుడుకు పాల్పడింది ఫరీదాబాద్‌లోని అల్‌ ‌ఫలాహ్‌ యూనివ‌ర్సిటీ ‌వైద్యుడు ఉమర్‌ ‌నబీగా గుర్తించారు. ఈ మేరకు అతడితో సంబంధం ఉన్న వ్యక్తులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఉమర్‌ ఓ ‌కరుడుగట్టిన ఉగ్రవాది అని తేలింది. ఉగ్ర దాడుల గురించి అతడు ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని సన్నిహితులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *