దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు

– సీట్లు కోల్పోతామన్న వాదనలో అర్థం లేదు
– కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

తిరువనంతపురం, ఏప్రిల్‌ 4: ‌జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్‌ ‌డెమోక్రటిక్‌ అలయెన్స్ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎల్డీఎఫ్‌ ఉద్వాసనకు కౌంట్‌డౌన్‌ ‌మొదలైందని చెప్పారు. తిరువళ్లూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కేరళ అభివృద్ధిపై కాంగ్రెస్‌ ‌సారథ్యంలోని యూడీఎఫ్‌ ‌కూటమి ఎన్నడూ దృష్టి పెట్టలేదని, 2004-2014 మధ్య కేరళ అభివృద్ధికి అప్పటి కేంద్రలోని యూపీఏ ప్రభుత్వం కేటాయించిన మొత్తం కంటే తమ ప్రభుత్వం ఎక్కువ కేటాయించిందని చెప్పారు. ఇంతకుముందు కూడా ఇక్కడకు వచ్చాను.. కానీ ఈసారి అన్ని వైపుల నుంచి మార్పు కోరుతున్న బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.. కేరళలో అతిపెద్ద మార్పు రాబోతోంది.. తొలిసారి బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం కేరళలో అధికారంలోకి రాబోతోంది అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎల్డీఎఫ్‌-‌యూడీఎఫ్‌ ‌ప్రభుత్వాలు ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి పట్టించుకోలేదని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, చాలా ఏళ్లుగా ఒక్క ప్రధాన బ్రిడ్జి కూడా నిర్మించలేదని, మెడికల్‌ ‌కాలేజీ పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఎవరైనా ఊహించవచ్చని అన్నారు. ఎన్డీయే విధానాలతో ప్రతి ఒక్క వర్గానికి, ముఖ్యంగా మహిళలు ఎంతో లబ్ది పొందుతున్నారని ప్రధాని అన్నారు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పన కేరళలో అతిపెద్ద సమస్యగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఇది మోదీ ఇచ్చే హామీ అని ప్రధాని భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్టాల్రు, గోవా తరహాలోనే కేరళను అభివృద్ధి చేస్తామని అన్నారు. శబరిమల రైల్వే ప్రాజెక్టు నిలిచిపోవడానికి ఎల్‌డీఎఫ్‌ ‌కారణమని విమర్శించారు. ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బీజేపీ డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని అడ్డంకులూ తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరి అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ ఆయన పశ్చిమాసియా అంశంపై భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *