రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది శూన్యం

– ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే  ఆల 

మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 17: అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తెగించి కొట్లాడుతున్నారని, మూడో విడతలోనూ బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదన్నారు. రెండేళ్లుగా ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేల సొంత గ్రామంలో కాంగ్రెస్‌ ఓటమి పాలవుతుండడంతో కాంగ్రెస్‌ సర్పంచును గెలిపిస్తేనే నిధులు మంజూరు చేస్తామని అనేకచోట్ల ఎమ్మెల్యేలు ఓటమితో ప్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందరికీ ప్రజాప్రతినిధిగా ఉంటారని, అభివృద్ధి, సంక్షేమంలో ప్రజలను సమానంగా చూడాలని అన్నారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *