– నోటీసులో సాంకేతిక లోపం.. సవరించి అందచేత
న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. విపక్షాల నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్‌ను ఓం బిర్లాను ఆదేశించడంతో ఈ సాంకేతిక లోపం బయటపడింది. విపక్షాలు మొదట ఇచ్చిన నోటీసులో 2026 సంవత్సరానికి బదులుగా 2025 సంవత్సరం అని ఉంది. వెంటనే పొరపాటును సరిచేసి రెండోసారి అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటరీకి విపక్షాలు అందజేశాయి. ఇండియా కూటమికి చెందిన 118 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. సభలో మాట్లాడేందుకు విపక్ష నేతలకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదంటూ ఈ నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే పార్టీలు దీనికి మద్దతు పలుకగా, తృణమూల్ కాంగ్రెస్ ఇంతవరకూ సంతకం చేయలేదు. ఈ పక్రియను సక్షించనున్నట్టు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తెలిపారు.అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ సంతకం చేయలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ తొలగింపు పిటిషన్‌పై ప్రతిపక్ష నేత సంతకం చేయడం సరైంది కాదని, రాహుల్ గాంధీ సంతకం చేయకపోవడానికి అదే కారణమని పేర్కొన్నాయి. కాగా, అవిశ్వాస తీర్మానం పరంగా లోక్‌సభలో బలాబలాలను చూసినప్పుడు లోక్‌సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. 293 మందితో మెజారిటీ సభ్యుల బలం వారికి ఉండగా, విపక్షాలకు 214 మంది సభ్యుల బలం ఉంది.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో విధులకు దూరం
స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీకి కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికిముందు అధికార పార్టీకి తలొగ్గి తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఓం బిర్లాకు రాసిన లేఖలో కాంగ్రెస్ మహిళా ఎంపీలు నిరసన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





