– మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ఎస్సీ, గిరిజన వసతి గృహాల విద్యార్థుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయలలో రాజీ పడేదే లేదని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఎస్పీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ తదితర శాఖల ఉన్నతాధికారులతో ముందస్తు బడ్జెట్‌పై మంత్రి అడ్లూరి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాలలలో వసతులు, మరమ్మతులు, రవాణా సౌకర్యం తదితర సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిధుల కొరత లేదని, వసతుల కోసం ఎంత బడ్జెట్‌నైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అత్యున్నత స్థాయికి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పమని, వారి ఆశయాలÅ£నుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. బోధన, ఉత్తమ ఫలితాలు, ఉన్నత శిఖరాలకు చేర్చే గురుతరమైన బాధ్యత ఉన్నతాధికారులదే అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్య, వైద్యానికి పెద్ద పీట
హాస్టల్ విద్యార్థుల విద్యా, వైద్యం, సదుపాయల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులను కేటాయించిందని మంత్రి అడ్లూరి వివరించారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం గత బడ్జెట్లో కేటాయించిన నిధుల అమలు తీరుపై నివేదికను రూపొందించి సమర్పించాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. హాస్టల్ భవనాలు, వసతులు, మరమ్మతులపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలను అందజేయాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని మంత్రి అన్నారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను పెంచామని, బోధనలో అసమానతలను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలను అధికారులునివేదికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. విదేశీ విద్యను సాకారం చేసుకోవాలనే ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి వరం లాంటిదని, లబ్ధిదారుల సంఖ్యను గతంలో ఉన్న 200 నుంచి 500కు పెంచామని, అధిక నిధులను కేటాయించామని, పోస్టు మెట్రిక్ విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేశామని, బిఏఎస్ విద్యా పథకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఉన్నత ప్రమాణాలతో స్టడీ సర్కిళ్ళు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదన్నారు. జాతీయ ప్రమాణాలతో పోటీపడేలా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ ప్రణాళికలను రూపొందిస్తున్నారని వివరించారు. లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడ అంబేద్కర్ భవనాలను దిల్లీ, చెన్నై తరహాలో అత్యాధునికంగా రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





