– అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య
– అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం
– ‘యంగ్ ఇండియా’ పనులు పరిశీలించిన భట్టి విక్రమార్క
బోనకల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే ఒక అతిపెద్ద ఆస్తి అని, అందుకే తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్య విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఆదివారం పరిశీలించిన ఆయన నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా స్కూల్‌ను అనుసంధానం చేస్తూ నిర్మించే రహదారులపై అధికారులతో చర్చించారు. ఈ స్కూల్ కోసం సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని, అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపయోగించే మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని, అందుకు అవసరమైన కూలీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. స్కూల్ పునాదులను, స్కూల్ ప్లాన్‌ను కూడా పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రాంగణాన్ని అధికారులతో కలిసి కలియ తిరిగి అన్ని అంశాలను పరిశీలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




