– రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు
– అసవరమైతే తప్ప బయటకు రావొద్దన్న కలెక్టర్
నిజామాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 28: అల్ప పీడన ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రెండు రోజుల పాటు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంల పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి పట్టణం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో జిల్లా జలదిగ్భందనంలో ఉంది. అలాగే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీ వర్షంగా మారింది. దీంతో నగరం దాదాపు జలమయం అయింది. దీంతో భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదావేశారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని వెల్లడించారు. శ్రీరామ్ సాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ జగదీష్ హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





