30న బిహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా

పాట్నా, మార్చి 27: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈనెల 30న తన పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికైన విషయం విదితమే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో పదవులు నిర్వహించరాదు. ఒక పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిహార్ శాసనసభ, శాసనమండలికి ఈనెల 29 వరకూ విరామం ఇచ్చారు. తిరిగి ఉభయ సభలు 30న సమావేశమవుతాయి. అదే రోజు నితీశ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనుండటం దాదాపు ఖారారైందని చెబుతున్నారు. కాగా, జేడీయూ అధ్యక్ష పదవికి నితీశ్ కుమార్ ఈనెల 24న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితీశ్ మినహా ఎవరూ ఈ పదవికి నామినేషన్ వేయలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్‌లో జేడీయూ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయడంతో అప్పటినుంచి ఆ పదవిని నితీశ్ నిర్వహిస్తున్నారు. కేంద్రంలో ఆయనకు కీలక మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *