రాజ్యసభ సభ్యుడిగా నితీష్‌ ‌ప్రమాణం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి  నితీష్‌కుమార్‌ ‌శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ ‌సి.పి రాధాకృష్ణన్‌ ‌తన ఛాంబర్‌లో నితీష్‌కుమార్‌ ‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్‌కుమార్‌ ‌హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ‌న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్వాల్‌లు హాజరయ్యారు. అలాగే జెడియు నేత, ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సంజరు కుమార్‌ ‌ఝా, కాంగ్రెస్‌ ‌నేత జైరాం రమేష్‌, ‌బిజెపి ఎంపి మాజీ కేంద్ర మంత్రి అయిన రాజీవ్‌ ‌ప్రతాప్‌ ‌రూడీ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. తదుపరి బీహార్‌ ‌సిఎం ఎవరనేది ఎన్‌డిఎ త్వరలో వెల్లడించనుంది. బహుశా 14‌న కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *