బీహార్‌ ‌శాసనమండలికి నితీశ్‌ ‌రాజీనామా

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌కూడా..

పాట్నా, మార్చి 30: బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‌శాసనమండలికి సోమవారం రాజీనామా చేశారు. ఈనెల‌ 16వ తేదీన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా నితీష్‌ ‌కుమార్‌  శాసనమండలికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో నితీష్‌ ‌శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. అలాగే బీజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌కూడా బీహార్‌ ‌శాసనమండలికి రాజీనామా చేశారు. ఆయన కూడా ఈనెల‌ 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా శాసనమండలికి రాజీనామా చేశారు. కాగా, 2005లో ఎన్‌డిఎ కూటమి తరపున నితీష్‌కుమార్‌ ‌ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక బిజెపికి మద్దతుగా, ఆ తర్వాత ఆ పార్టీని వ్యతిరేకిస్తూ మహాగట్బంధన్‌ ‌వైపు మద్దుతుగా నిలిచి తన సీఎం పదవిని కాపాడుకున్నారు.   2013, 2017, 2022, 2024లో పార్టీలు మారుతూ సీఎంగా కొనసాగారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి రికార్డు స్థాయిలో విజయం సాధించి పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *