బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్

న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 14 : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్‌ మంత్రి నితిన్ నబిన్‌ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన నియామకాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించినట్లు పేర్కొన్నారు. నితిన్‌ నబిన్ పదోన్నతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న అంకితభావంతో కూడిన కార్యకర్తగా ఆయనను అభివర్ణించారు. కాగా, నితిన్‌ నబిన్ ప్రస్తుతం సీఎం నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానాన్ని నితిన్‌ నబిన్‌ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *