రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించాకే శ్లాబులు

~ జీఎస్టీ శ్లాబులపై నిర్మలా సీతారామన్‌ ‌వివరణ
~ ధరలు దిగివొచ్చి సామాన్యులకు మేలు చేస్తుందని వెల్లడి

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 6: ‌ఇప్ప‌టివ‌ర‌కు జీఎస్టీ శ్లాబులు 5, 12,18, 28 శాతంగా ఉండేవ‌ని, అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ శ్లాబుల విధానం బిజెపి నిర్ణయం కాదని, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ తీసుకున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌శనివారం స్పష్టం చేశారు. నాలుగు శ్లాబుల విధానంపై ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. నాలుగు శ్లాబుల విధానం కాస్తా తాజాగా జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ ‌సమావేశంలో 5, 18 శాతం శ్లాబులకి తగ్గిస్తూ గతంలో ఉన్న 12, 28 శాతం శ్లాబులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ శ్లాబులు సెప్టెంబర్‌ 22 ‌నుంచి అమల్లోకి రానున్నాయ‌న్నారు. దీనిపై నిర్మలా సీతారామన్‌ ‌పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామాన్యులపై దృష్టి సారించి సంస్కరణలు చేపట్టాము.. సామాన్యుడు వినియోగించే వస్తువులపై విధించే పన్నుపై స‌మీక్షించాం.. ఈ సంస్కరణల వల్ల రేట్లు బాగా తగ్గనున్నాయి’ అని అన్నారు. ఇక జీఎస్టీలో సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామ‌న్నారు. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు లేఖ రాసినట్లు చెప్పారు. పన్ను రేట్లను సవరించాలనే దానిపై రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పినప్పటికీ అవన్నీ సామాన్యుడికి ప్రయోజనం కలిగించేవేనన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు ఎంతో దోహదపడతాయన్నారు. జీఎస్టీ రేట్లలో మార్పునకు మద్దతు తెలియజేసినందుకు ప్రతి ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియజేశా. ఎన్ని తీవ్రమైన చర్చలు, వాదనలైనా చేయవచ్చు. చివరకు జీఎస్టీ కౌన్సిల్‌ ‌నిర్ణయాలతో దేశ ప్రజలకు ఉపశమనం కలిగింది అన్నారు. సామాన్యులకు ప్రయోజనం చేకూర్చే సవరణలే ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేదన్నారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ ఒక్కతాటిపైకి రావడం సంతోషకర విషయమన్నారు.రేట్ల తగ్గింపుపై రాష్ట్రాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయని, అయితే, వారి ఆందోళనంతా రాబడిలో కోతపైనే ఉంటుందని నిర్మలపేర్కొన్నారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలకే కాకుండా కేంద్రం కూడా ఆదాయం కోల్పోతుందన్న విషయం వారికి చెప్పానన్నారు. రేట్లు తగ్గితే ప్రజలు కొనుగోలు చేస్తారు.. తద్వారా కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వాలు భర్తీ చేసుకోవచ్చు.. ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర మంత్రి వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *