– అన్ని విభాగాలను పటిష్ఠపర్చాలి
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నిలోఫర్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో రెండవ అత్యధిక ఓపీ, ఐపీ వైద్య సేవలందిస్తున్న నిలోఫర్ హాస్పిటల్ బలోపేతంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు హాస్పిటల్‌లో హాస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకులకు వసతి కల్పనపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కేడర్ స్ట్రెంగ్త్‌కు అనుగుణంగా సిబ్బంది నియామకంపై దృష్టిసారించాలని మంత్రి ఆదేశించారు. అలాగే హాస్పిటల్‌లోని భవనాల పరిస్థితిపై టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి చర్చించారు. నిలోఫర్‌లో మౌలిక సదుపాయాల కల్పన, హెచ్‌ఆర్, పరికరాల మరమ్మతులు, వాటర్ ప్లాంట్, శానిటేషన్, డ్రైనేజీ సిస్టం, మౌలిక సదుపాయాలు, రోగులకు, వారి సహాయకులకు అవసరమైన సౌకర్యాల కల్పన కు పెద్ద పీట వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ వీణ ఫణిందర్ రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, అదనపు డీఎంఈ డాక్టర్ వాణి, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు .
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





