– తల్లి ఒడిలో నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారి మృతి
భోపాల్, జనవరి16 : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కారులో వెళ్తుండగా అడవి జంతువు ఉన్నట్టుండి కారులోకి దూసుకురావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుణ ప్రాంతానికి చెందిన సోను జాట్ అనే వ్యక్తి సంక్రాంతి పండగను జరుపుకోవడానికి తన భార్య, నాలుగేళ్ల కుమార్తె తాన్యతో కలిసి బుధవారం తమ స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. బైపాస్‌లోని దోఖంభా ప్రాంతంలో రెండు నీల్‌గాయ్ జంతువులు అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చాయి. సోను అప్రమత్తమయ్యేలోపు వాటిల్లో ఒకటి కారు అద్దం పగలగొట్టుకుని లోపలికి దూసుకొచ్చింది. దీంతో ముందు సీటులో తల్లి ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల తాన్య తలకు జంతువు కాళ్లు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కారులో చిక్కుకున్న నీల్‌గాయ్‌ను బయటకు తీసి చికిత్స అందిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


