– బృందాలుగా ఎన్‌ఐఎ అధికారులు తనిఖీలు
జనగామ, ప్రజాతంత్ర, జనవరి 13: సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు చెందిన జాఫర్‌ఘడ్ ప్రాంతంలోని మాఇల్లు అనే పేరుతో ఉన్న అనాథశ్రమంలో మంగళవారం ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచే ఎన్‌ఐఏ అధికారులు బృందాలుగా విడిపోయి.. ఆశ్రమంలోని రికార్డులు, కంప్యూటర్లు, ఇతర పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఎన్‌ఐఏ సోదాలు చేస్తుండటంతో మీడియా ఆ ప్రాంతానికి చేరుకుంది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలో సమాచారం బయటకు రాకుండా డియాను లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇన్నయ్యను ఎన్‌ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రిమాండ్‌లో ఉన్న ఇన్నయ్యను ఎన్‌ఐఏ విచారిస్తోంది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగానే ఇన్నయ్యకు సంబంధించిన అనాథాశ్రమంలో జరిగే కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తదితరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. ఎన్‌ఐఏ అధికారులు ఒక అనాథాశ్రమంపై దృష్టి సారించడం,‘ఉపా’ చట్టం కింద చర్యలు తీసుకోవడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




