నవ వధువు ఆత్మహత్య

– కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరాజ్ బన్సల్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ మియాపూర్‌లోని మక్త మహబూబ్‌పేట్‌లోని ఓ అపార్టుమెంటులో నివాసముంటున్నారు. కొంతకాలంగా అదనపు కట్నం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇషిక ఆత్మహత్య చేసుకుంది. భర్త సమాచారంతో మియాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *