హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : హైదరాబాద్ లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు బొకే అందజేసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జలాలు, నిజాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ నుంచి అక్కడికి వెళ్లారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ కుటుంబాన్ని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం కలిశారు. ఈ సందర్భంగా అపరేశ్ కుమార్‌కు బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





