– ఉప ఎన్నికలో ఎన్డీయేదే గెలుపు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థే గెలుపొందారు. ఈ ఎన్నికలో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డిపై రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దిల్లీలో మంగళవారం ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియగా ఓట్ల లెక్కింపు అనంతరం రాత్రి 7.30 గంటలకు ఫలితాలు ప్రకటించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 788 అర్హులైన ఎంపీలలో 767మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 98.2 శాతం సూచిస్తున్నది. ఈ విజయం ఆయన రాజకీయ అనుభవాన్ని, ఎన్డీయే కూటమి బలాన్ని ప్రతిబింబించింది. ఎన్డీయే అభ్యర్థి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొత్తం 767 ఓట్లలో రాధాకృష్ణన్‌్‌కు 452 ఓట్లు ఇండీ కూటమి అభ్యర్థికి 300 ఓట్లు వచ్చాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు క్రాస్-ఓటింగ్ చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలో చీలికలు కనిపించాయి. 15 ఓట్లు చెల్లనివని రిటర్నింగ్ అధికారి పిసి మోడి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.