•వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : అగ్రి షోలతో రైతులకు నూతన సాంకేతికత అందుబాటులోకి వొస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారం తో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్, కిసాన్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘కిసాన్ అగ్రి షో, మూడు రోజుల ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇన్ హార్టికల్చర్ క్రాప్స్ ప్రొడక్షన్ అండ్ వాల్యూ అడిషన్’’ వర్క్‌షాప్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్బ •ంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రకమైన అగ్రి షోలు రైతులకు నూతన సాంకే తికతలను అందు బాటులోకి తేవడంలో కీలక పాత్ర వహిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యాన పంటలు సాగు విస్తీర్ణం పెంచడమే కాకుండా వివిధ రకాల ఉద్యాన పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రైతాంగం శక్తి సామర్థ్యం పెంచడానికి ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
వివిధ రకాల ఉద్యాన పంటల సాగులో నూతన ఒరవడిని, టెక్నాలజీలు, పంట ఉత్పత్తులను వాల్యూ అడిషన్ కోసం గ్రామ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి రైతులను రాబోయే రోజుల్లో ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యాన, వ్యవసాయ శాఖ వివిధ స్థాయిలోని అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆర్థిక స్వయం సమృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండ రాజీ రెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి, ఉద్యాన శాఖ అడిషనల్ డైరెక్టర్ సరోజినీ, జాయింట్ డైరెక్టర్ బాబు, తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం అధ్యక్షుడు చక్రపాణి, ఉపాధ్యక్షులు సాయిబాబా, కార్యదర్శి నర్సయ్య, రంగా రెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సురేష్, కమల పాల్గొన్నారు.





