సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ

దిల్లీ, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.ముర్పీ దిల్లీిలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ విజన్‌-2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. భేటీలో గవర్నర్‌ సతీమణితోపాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *