హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త‌ విమాన సర్వీసు

– ఫ్లై91 విమాన సర్వీసును ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం/విజయవాడ, ఏప్రిల్ 10 హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై-91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. రెండు రాజధానుల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతోపాటు, సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఫ్లై-91 సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నూతన సర్వీసును శ్రీకాకుళం నుంచి వర్చువల్గా పచ్చ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా సామాన్యులు కూడా విమానం ఎక్కాలన్న ప్రధానమంత్రి కల నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య రద్దీ దృష్ట్యా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని, విమాన ప్రయాణం కేవలం 50 నిమిషాల నుంచి గంటలో పూర్తవుతుందని తెలిపారు. హైదరాబాద్లో ఐటీ రంగం, విజయవాడలో వ్యాపార రంగాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఈ విమాన సర్వీస్ వ్యాపారవేత్తలకు వరంలా మారనుంది. ఈ సంస్థ ప్రధానంగా తక్కువ దూరం ఉండే నగరాల మధ్య సర్వీసులను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తమ నెట్వర్క్ ను పెంచుకోవడం ద్వారా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త సర్వీసుతో విజయవాడ, హైదరాబాద్ ప్రజలకు రవాణాపరంగా మరిన్ని వెసులుబాట్లు కలగనున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *