మనస్తాపంతో భార్య, ఆవేదనతో భర్త ఆత్మహత్య

– ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విషాదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడిరది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు. అలా సక్సెస్‌ అయ్యిందనుకున్న వారి లవ్‌ స్టోరీ పెళ్లయిన వారానికే విషాదాంతంగా మారింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఎదురెదురు ఇండ్లలో ఉండే సంతోష్‌, గంగోత్రి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించి సెప్టెంబర్‌ 26న పెళ్లి చేసుకున్నారు. దసరా పండుగ కావడంతో ఈ నెల 2వ తేదీన దంపతులిద్దరూ గంగోత్రి ఇంటికి వెళ్లారు. అక్కడ మాంసం కూరలో కారం ఎక్కువైందని గంగోత్రిని సంతోష్‌ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి అదే రోజు రాత్రి అత్తారింటికి వెళ్లాక దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తన కారణంగానే తనువు చాలించిందని సంతోష్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మనసు బాగోలేకపోవడంతో దీపావళి పండక్కి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉండే తన అక్క దగ్గరకు వెళ్లాడు. అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ నెల లోపే మరణించడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *