కొత్త చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌

రాష్ట్రపతి ఆమోదముద్ర.. గెజిట్‌ జారీ

హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ ఆమోదముద్ర వేశారు. వెంటనే కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ ప్రచరణ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియం జస్టిస్‌ ఏకే సింప ను తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి నివేదించింది. రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో సోమవారం గెజిట్‌ వెలువడింది. ప్రస్తుతం జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్నారు. 1965, జూలై 7న జస్టిస్‌ ఏకే సింగ్‌ జన్మించారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2001లో జార్ఖండ్‌ హైకోర్టుకు లా ప్రాక్టీస్‌ను మార్చారు. 2012లో జార్ఖండ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022, డిసెంబర్‌ నుంచి 2023, ఫిబ్రవరి వరకు జార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2023, ఏప్రిల్‌ 17న ప్రధాన న్యాయమూర్తి పదోన్నతి లభించడంతో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *