యాదాద్రిలో నూతన అన్నదాన భవనం ప్రారంభం

– తిరుమల తరహాలో భక్తులకు సౌకర్యవంతంగా నిర్మాణం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ శాంతా ఋష్యశృంగ అన్నప్రసాద వితరణ భవనాన్ని ఆలయ అధికారులు. బుధవారం ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రంగా, అత్యుత్తమ నాణ్యతాప్రమాణాలతో అన్నప్రసాదాలను అందించేందుకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ భవనాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఈ కేంద్రాన్ని వేగేశ్న ఫౌండేషన్‌ దాదాపు రూ.21 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించింది. ఇందులో అత్యాధునిక కిచెన్‌ సదుపాయాలు, భారీ భోజన మండపం, వంట సామగ్రి, హైజినిక్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో ఈ భవన నిర్మాణం పనులు పూర్తి కావడంతో గత నెల 30న దేవస్థానానికి అధికారికంగా అప్పగించారు. ఈ నూతన అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మరింత పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించనున్నారు. స్వామి వారి కృపతో అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరింత వేగంగా కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకట్రావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *