నా రాజ‌కీయ జీవితంలో ఇలాంటి కుట్ర‌లు చూడ‌లేదు

– రాజకీయాల్లో ఉండాలా వ‌ద్దా అని ఆలోచించాల్సి వ‌స్తోంది
– చైర్మన్ ఎన్నిక తీరుపై తీవ్ర‌ అసహనం
– క‌న్నీరు పర్యంతమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి

తొర్రూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  17 : మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డ్రా పద్ధతిలో కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మాజీ మంత్రి దయాకర్ రావు తీవ్ర‌ అసహనానికి గురయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారిలో త‌మ  కౌన్సిల‌ర్ల‌ను కొనాలని చూసినా ఎవ‌రూ లొంగలేదని అన్నారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వ‌ద్దా ? అనిపిస్తోంద‌ని ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు. త‌న రాజకీయ జీవితంలో ఇంత మోసం, దగా చూడలేదని చెప్పారు.  45 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని ఆయ‌న భావోద్వేగానికి గుర‌య్యారు.
మంగ‌ళ‌వారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ పార్టీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చే సమయంలో మార్గమధ్యలోనే నిలిపివేసి మాజీ మంత్రిని అదుపులోకి తీసుకొని జిల్లాలోని నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అయితే చైర్మన్ పీఠాన్ని ఎన్నికల పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయాన్ని చెప్పగానే మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి కన్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్ర‌జ‌లు బీఆర్ఎస్ కు పట్టం కడితే  ప్రభుత్వం అన్యాయం చేసిందని విమ‌ర్శించారు.  తొర్రూరు లోని కార్యాలయాన్ని కూడా వెళ్లకుండా మార్గమధ్యలో అరెస్టు చేసి తీసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామిక ప‌ద్ధ‌తిలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారని విప్‌ జారీ చేయాల్సిన త‌న‌ను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  మున్సిపాలిటీలో రూ.కోట్ల ఆశ చూపినా కూడా త‌మ కౌన్సిలర్లు లొంగలేదని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక ఇబ్బందులకు గురి చేశారని, కడియం కావ్యకు వోటు హక్కు లేదని గతంలో వరంగల్ జిల్లా కేంద్రంలో వేశారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు చేసిన పోరాట ఫలితంగానే మున్సిపాలిటీలో 9 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంద‌ని, అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారిలో త‌మ  కార్యకర్తలను కొనాలని చూసినా కూడా లొంగలేదని అన్నారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వ‌ద్దా ?అనిపిస్తోంద‌ని పేర్కొన్నారు. త‌న రాజకీయ జీవితంలో ఇంత మోసం ఇంత దగా చూడలేదని చెప్పారు.  45 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని ఎర్ర‌బెల్లి భావోద్వేగానికి గుర‌య్యారు. ప్రభుత్వ అధికారులు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా పని చేయడం సరికాద‌ని ఆవేదన వ్యక్తం చేశారు .


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *