– కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి
– నెట్‌ఫ్లిక్స్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తాను గతంలోనే చెప్పానని, నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని హైటెక్స్‌లో ఆయన గురువారం ప్రారంభించారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం.. మీ విస్తరణకు పెద్ద కార్యాలయ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నా అని అన్నారు. వినోద రంగంలో ప్రసిద్ధి చెందిన నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాదుకు రావడం గొప్ప విషయం.. ప్రజా ప్రభుత్వం తరపున నెట్‌ఫ్లిక్స్ ఐలైన్‌కు హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నానని సీఎం అన్నారు. డివిడి అద్దె సంస్థ నుండి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతోపాటు చాలా ఆదర్శంగా అనిపిస్తోందని అన్నారు. అంతటి ప్రసిద్ధి చెందిన నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ సంస్థలకు సొంత ప్రదేశంగా ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌కు, హైదరాబాదుకు సామీప్యత ఉందని, కారణం నెట్‌ఫ్లిక్స్, హైదరాబాదు రెండింటి వృద్ధి అంతర్జాతీయంగా దినదిన ప్రవర్థమానం అవుతున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, మంచి కంటెంట్‌తో అందరికీ వినోదం ఇవ్వడమే నెట్‌ఫ్లిక్స్ ధ్యేయమైతే ప్రపంచ సంస్థలకు వేదిక అవుతూ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే హైదరాబాద్ లక్ష్యం అని చెప్పారు. నిజాం కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఆహ్లాదకరమైన నగరంగా హైదరాబాద్ అలరారిన విషయం తెలిసిందేనంటూ ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ఎదిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ను, హైదరాబాదును అందరూ ప్రేమిస్తారని, ఎందుకంటే ఈ రెండూ ఎంతోమందికి ఫుడ్, ట్రావెల్, హిస్టరీ, హెరిటేజ్, సంస్కృతి, సంప్రదాయాలను అందిస్తుంటాయని వివరించారు. నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ ఇక్కడకు రావడంతో ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విషయాలు చూపించే అద్భుత అవకాశం దొరుకుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల క్రీడలపై చాలా దృష్టి పెట్టినట్లు తెలిసిందని, రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ క్రీడా ప్రసార సంస్థగా మారుతుందని భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ కూడా క్రీడలపై కీలకంగా దృష్టి కేంద్రీకరించిందని, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించడం, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు, క్రీడలకు సంబంధించి అన్ని స్థాయిల్లో ప్రతిభను ప్రోత్సహించడం చేస్తున్నాంటూ ఇందుకు నెట్‌ఫ్లిక్స్ సహకారాన్ని కోరారు. ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇండియా, తెలంగాణ ఎంతటి పాత్రను పోషించబోతున్నాయో తెలిపేందుకు ఈరోజు జరిగిన కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణ అని అన్నారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డి.శ్రీధర్ బాబు, సినీ నటుడు రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





