– కూకట్‌పల్లిలో విగ్రహం ఆవిష్కరించిన బీజేపీ చీఫ్ రామచందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అగ్రగణ్యుడని, దేశ యువతను సంఘటితం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్య్ర సాధనకు సైనిక మార్గంలో పోరాటానికి నాయకత్వం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ 129వ జయంతిని పురస్కరించుకొని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రామచందర్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ 1943 డిసెంబర్ 30న అండమాన్-నికోబార్ దీవుల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి భారత స్వాతంత్య్రాన్ని ప్రకటించిన నేతాజీ ధైర్యం, దేశభక్తికి శాశ్వత చిహ్నమని తెలిపారు. నేతాజీ త్యాగం, సంకల్పం, దేశభక్తి ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన జీవితం, ఆలోచనలను అధ్యయనం చేసి దేశ సేవ పట్ల బాధ్యతను మరింత బలపరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్య్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి హృదయపూర్వక శ్రద్ధాంజలి, వందనాలు అర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కార్య్రకమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





