ఆఫ్రిక‌న్ల కోసం పోరాడిన నెల్స‌న్ మండేలా

సొంత దేశంలో బానిసత్వం, వివక్షత, సొంత గ‌డ్డ‌పై  అద్దెకు నివసిస్తూ, అధికారాల‌కు దూర‌మై ఎటువంటి గ‌మ్యంలేక‌, భ‌విష్య‌త్తుపై ఆశ‌లు లేక బ‌తుకులీడుస్తున్న ప్ర‌జ‌ల స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల‌కోసం పోరాడిన నెల్స‌న్ మండేలా, అదే నినాదం పై పోరాడి బారత రాజ్యాంగం లో హక్కులు పొందు పరచిన అంబేడ్కర్ … ఇద్ద‌రూ చీరస్మరణీయులే. దక్షిణాప్రికాలో శ్వేతజాతీయులు అణిచివేతకు గురిచేస్తే బారత దేశంలో స్వంత దేశస్తులే అణిచివేత‌ల‌తో పాటు అంటరానితనం పేరుతో అసమానతలు చూపారు. 1946, సంవత్సరం ద‌క్షిణాఫ్రికాలో  వెలివడాల చట్టం తీసుకు వచ్చినప్పుడు  ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.  ఆ చట్టం ప్రకారం భారతీయులు ఒక పరిమిత ప్రాంతంలో మాత్రమే ఉండాలి,వెరే ప్రాంతాలలో ఉండానికి వీలు లేదు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రెండు సంవత్సరాలు,నిరసనలు,సమ్మెలు అనేక రకాల పోరాటాలు చేశారు .ఇలాంటి పోరాటాల చరిత్ర ఆఫ్రికా చరిత్రలో అంత‌కుముందు ఎన్న‌డూ జ‌ర‌గ‌లేదు లేదు. ఈ పోరాటాన్ని అప్రికా నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కుడు నెల్సన్ మండేలా స్పూర్తి గా తీసుకున్నాడు.

మండేలా ఐదు సంవత్సరాల వయస్సులో పశువుల కాపరిగా వుండేవారు. 7 సంవత్సరాల వయస్సులో తన బందువుల సలహా మేరకు బడిలో చేరారు. బ‌డికి వెళుతున్న కొడుకు గొంగ‌డి చూసి , మంచి డ్రెస్ ఇవ్వలేని పరిస్తితిలో తన ప్యాంట్ మోకాళ్ళ వరకు చింపి మండేలాకు తొడిగాడు. అదే మండేలా మొదటి డ్రెస్. మొదటి రోజు మండేలా బడిలోకి వెళ్ళాడు. బడిలో టీచర్ అందరి పేర్లు చెప్పమనగానే అందరూ చెప్పారు.  శ్వేత జాతీయురాలైన ఆమెకు ఆ పేర్లు పలకడం రాక పోవడం వల పిల్లల పేర్లు మార్చింది. నెల్సన్ మండేలా అస‌లు పేరు ( హోలీ హ్ల హ్లా ) ఈ పేరు పలకడం ఇబ్బంది గా ఉంది అని నెల్సన్ అనే పేరు పెట్టింది టీచర్. ఇది ఆయ‌న తాత‌ పేరు. తేంబు తెగలలో తాత‌ల లేక తెగల పేర్లు పెట్టుకుంటారు. ఆ రోజు నుండి నేల్సన్ మండేలా అని పిలిచారు. మండేలా 9 వ సంవత్సరం లో తండ్రి చనిపోవడం , రాజ ప్రతినిధి పర్యవేక్షణ లో చదువు కొనసాగించారు. ఉన్న‌ద విద్య‌కోసం పుట్టి పెరిగిన గ్రామాన్ని వ‌దిలేయ‌డానికి మండేలా చాలా బాధ‌ప‌డ్డారు. ఈ బాధ త‌న తండ్రి మ‌ర‌ణించి న‌ప్ప‌టికంటే ఎక్కువ‌గా వుండ‌టం, ఆయ‌న‌కు త‌న గ్రామంపై ఎంత‌టి మ‌క్కువ వున్న‌దీ తెలియ‌జేస్తుంది.

కాలేజీలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. త‌ర్వాత‌ రాజప్రతినిది మండేలాకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని తప్పించుకొని తిరుగతున్న క్రమంలో అఫ్రికా ప్రజలపై కొన‌సాగుతున్న‌ అణ‌చివేత‌ను గుర్తించాడు. బంగారు గనులలో నల్ల జాతీయులను వెట్టి చాకిరీ చేయిస్తున్న తీరును గుర్తించి  పెట్టుబడి దారి విధానం యొక్క రూపం అర్ధం చేసుకున్నాడు. అక్కడే ఒక కంపెనీలో క్ల‌ర్క్ గా జాయిన్ అయ్యాడు. ఆఫీసు లో రెండు టీ గ్లాస్ ల పద్దతి చూశాడు, శ్వేత జాతీయులకు పాత గ్లాస్, నల్ల జాతీయులకు కొత్త గ్లాస్ లో టీ తాగాలి. తన స్నేహితుడు అయిన గార్ రణబె ఈ అల‌వాటును బ్రేక్ చేశాడు.

అతను ద‌క్షిణాఫ్రికా నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు కార్యకర్త, అలాగే అదే ఆఫీసులో మ‌రో శ్వేత జాతీయుడు స్నేహితుడు అయ్యాడు. అతను కూడా కమ్యూనిస్టు. వీరి యొక్క ప్రభావం మండేలా మీద పడింది. మండేలా ఆఫ్రిక‌న్‌ నేషనల్ కాంగ్రెస్ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొన‌డం మొద‌లుపెట్టాడు. ఆఫ్రిక‌న్ల‌ కోసం నాసిరకం, ఆస్పత్రులు, బస్సులు, స్కూల్స్  వుంటాయి. కొందరు స్కూల్ ముఖం కూడా చూడరు. చదివిన ఆఫ్రిక‌న్‌ల‌కు కేటాయించిన కింది స్తాయి పనులు, కనీస సదుపాయాలు లేని నివాస ప్రాంతాల్లో బ‌తుకులు దుర్భ‌రంగా వుండేవి. ఆఫ్రిక‌న్‌ ప్రాంతాలలో మాత్రమే కిరాయికి ఉండాలి.

తన దేశంలో పాస్ చూపించాలి. శ్వేత జాతీయులకు కేటాయించిన ద్వారం గుండా వెళితే నేరంగా ప‌రిగ‌ణించేవారు. వాళ్ళకు కేటాయించిన బస్సుల్లో ప్రయాణం చేయ‌డానికి వీల్లేదు. కుళాయిల్లో నీళ్ళు తాగినా నెరమే, బీచ్ లో నడిచిన నెరమే , రాత్రి పుట వీధుల్లో కనిపించిన నెరమే.  ఏ పని చేయకున్న నెరమే,  న‌చ్చిన చోట ఇల్లు కట్టుకున్న నెరమే, పోల్ పన్ను కట్టకున్న నెరమే, కట్ట లేని వారిని హింసించి  జైల్లో పెట్టేవారు. అడుగ‌డుగునా ఆంక్షలు, అవమానాలు, అణ‌చివేత‌లు. ఈ బాధ‌లు కట్ట గట్టుకొని కోపాన్ని, తిరుగుబాటు తనాన్ని నిద్ర లేపాయి.  జాతి విముక్తి పోరాటానికి అంకితం చేసుకునేల చేశాయి. శాంతియుత పోరాటాలతో నల్ల జాతీయుల విముక్తి జరుగదు . సాయుధ‌ పోరాటం ద్వారానే నల్ల జాతీయుల విముక్తి అని నిర్ణ‌యానికి వ‌చ్చి సాయుద పోరాట‌ కార్యక్రమాలు చేప‌ట్టారు. సాయుధ‌పోరాటానికి అనేక దేశాల మద్దతు కూడా గట్టాడు.  చివ‌ర‌కు 1962 ఆగస్టు 5 పోలీసులు అరెస్టు చేశారు.

తన కేసు తానే వాదించుకున్నాడు, తాను చేసిన సాయుద‌ పోరాటం లో జరిగిన వాటికి బాధ్య‌త‌ వహించాడు. దానికి మరణ శిక్ష వేయాలి కానీ జడ్జి మరణ శిక్ష నుండి యావజ్జీవ  శిక్షగా మార్చారు.నెల్సన్ మండేలా ను జైల్లో పెట్టారు కానీ పోరాటాలు చాల తీవ్ర రూపం దాల్చాయి.  శాంతి చర్చలు స‌ఫ‌లం కావడంతో మండేలా 27 సంవతరాలకు బయటకు వచ్చాడు. ఆఫ్రిక‌న్‌ ప్రజలు రాజ్యాంగం,హక్కులు పొందుపరచుకున్నారు. ఆఫ్రిక‌న్‌ ప్రజలు ఓటు హాక్కు ద్వారా ఎన్నికల్లో మండేలాను దేశాధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. వయస్సు రీత్యా అధ్య‌క్ష స్థానానికి రాజీనామ చేసి, నెల్సన్ మండేలా ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాడు. డిసెంబర్ 5 వ తేదీన భౌతికంగా దూరం అయ్యాడు. నెల్సన్ మండేలా దద‌క్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత, అనేక అసమానత వ్యతిరేక ఉద్యమాలు చేశాడు. రాజ్యాంగం లో ప్రాథమిక‌ హక్కులు కల్పించడంలో అంబేడ్కర్ కీలక పాత్ర వహించాడు.  అంబేడ్కర్, నెల్సన్ మండేలా స్పూర్తిని సామాజిక , రాజకీయ ఉద్యమాలలో తీసుకొని ముందుకు వెళదాం.
ముక్క ఐలయ్య అరుణ
రైతు , హక్కుల కార్యకర్త .
గ్రామం: బేతిగల్, మండలం: వీణవంక,
కరీంనగర్ జిల్లా
మొబైలు నెంబర్ : 9848789346.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *