కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణం

– డిమాండ్‌ ‌బుక్స్‌లో అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌ముద్రించారు
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌కు సంబంధించి డిమాండ్‌ ‌బుక్‌, అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌బుక్‌ ఒకేలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో సర్కస్‌ ‌నడిపిస్తున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు. జగదీశ్‌ ‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడుతూ డిమాండ్‌ ‌బుక్స్‌లో అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌ముద్రించారని తెలిపారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. ఆర్థిక మంత్రి తన సొంత ఆర్థిక కారణాలపై బిజీగా ఉన్నట్లు అనిపిస్తుందని విమర్శించారు. తప్పు చేసి సరిదిద్దుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. అవుట్‌ ‌కమ్‌ ‌బ్జడెట్‌, ఈ ఏడాది గ్రాంట్స్ ‌బుక్‌లు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. గతంలో సాధించిన ఫలితాలు, ఈ ఏడాది గ్రాంట్స్‌పై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. డిమాండ్‌ ‌బుక్‌, అవుట్‌ ‌కమ్‌ ‌బ్జడెట్‌ ‌బుక్‌ ఒకేలా కాపీ పెస్ట్ ‌చేశారని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రెండు బుక్‌లు తయారు చేస్తే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. ఇది పొరపాటు కాదు నేరమే అని స్పష్టం చేశారు. తక్షణమే తప్పును సర్దుకొని సభకు క్షమాపణ చెప్పాలని జగదీశ్‌ ‌రెడ్డి  డిమాండ్‌ ‌చేశారు. సభలో ఇదే విషయమై మాట్లాడతానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *