మైనస్‌ ద్రవ్యోల్బణం నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మైనస్‌ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో -0.93 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 1.31 శాతం ఉండగా మార్చిలో 1.06 శాతానికి తగ్గింది. కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా, ఈ పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశంసించారు. ఇది ప్రజా పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *