సిగాచిలో ఎన్‌డిఎంఎం బృందం పరిశీలన

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య
క్షతగాత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి

హైదరాబాద్‌, పజాతంత్ర, జూలై 8:పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ-(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ ప్రశ్నల వర్షం కురిపించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ అధికారుల స్పందనపై బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. రసాయన పరిశ్రమ గురించి తమకు తెలుసని, పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇదిలావుంటే సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకూ 44 మంది ప్రాణాలు కోల్పోయారు. పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. పనేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరిఫ్‌, ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేశ్వర్‌ మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44కు చేరింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *