– కేంద్రాన్ని ఒప్పించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
– వారం రోజుల్లో స్థల పరిశీలన కు అధికారుల బృందం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంను అమీన్‌పూర్‌లోనే స్థాపించేలా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్రాన్ని ఒప్పించారు.శుక్రవారం నవోదయ పాఠశాల డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేర ను కలిసి ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా, పాఠశాల నిర్మాణం, తాత్కాలిక వసతి సదుపాయాలపై సమగ్రమైన చర్చ జరిపారు. అమీన్ పూర్‌లోనే పాఠశాల ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ కమిషనర్ ని ఒప్పించారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రూ.1500 కోట్లతో నిర్మించే ఈ పాఠశాలకు ఏటా రూ.500 కోట్ల చొప్పున మూడేళ్లు నిధులు విడుదల జరుగుతుందన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక వసతి కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నవోదయ పాఠశాల కు అమీన్ పూర్ లో కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు అధికారులు వచ్చే వారం రానున్నారని తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు అవసరం అయ్యేలా భూమిని అభివృద్ధి చేసి ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రఘునందన్ స్పష్టం చేశారు.
——————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





