జూబ్లీహిల్స్‌లో న‘విన్‌’

-బీజేపీకి దక్కని డిపాజిట్‌
– బీఆర్‌ఎస్‌కు రెండో స్థానమే

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్ విన్ అయ్యారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729ఓట్ల మెజారిటీ రు. కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డి డిపాజిట్‌ కోల్పోగా, బీఆర్‌ఎస్‌ రెండవ స్థానంలో నిలిచింది. ఫలితాలను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు, డిఈఓ సమక్షంలో ప్రకటించిన రిటర్నింగ్‌ అధికారి పి.సాయిరాం నవీన్ యాదవ్ కు గెలుపు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అంద‌జేశారు. మొత్తం ప‌ది రౌండ్ల లెక్కింపున‌కు గాను తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేస‌రికి 23,612 ఓట్ల ఆధిక్యంతో నవీన్‌ కొనసాగారు. ప్రతీ రౌండ్‌లోనూ సునీతపై ఆధిక్యంలో కొన‌సాగారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సాయంత్రం 5 గంటలకు మంత్రులతో సమావేశం కానున్నారు, ఆ తర్వాత మీడియా సమావేశం జరగనుంది. ఈ ఫలితాలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భారీ సభలు కాకుండా కీలక ప్రదేశాల్లో కార్నర్‌ మీటింగ్‌లతో ప్రచారం నిర్వహించారు. ప్రతి మంత్రికీ డివిజన్‌ వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. మైనారిటీల్లో పట్టు నిలుపుకునేందుకు ఎన్నిక సమీపిస్తున్న దశలో క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page