నవీన్ కుమార్ రెడ్డికి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్  

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5: ఘటకేసర్ లోని  శ్రీనిధి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న  చామకూర నవీన్ కుమార్ రెడ్డికి  కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్  విభాగంలో డాక్టరేట్  ప్రదానం చేసింది. ఆప్టిమైజ్ రూట్ డిస్కవరీ ఇన్ ఫ్లయింగ్ అడహాక్ నెట్వర్క్స్ అనే అంశంపై  పరిశోధన చేసి గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి  సమర్పించారు. టెక్నాలజీ అభివృద్ధితోపాటు డ్రోన్‌ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గాల్లో ఎగిరే అనేక డ్రోన్లు ఒకదానితో ఒకటి వైర్‌లెస్ రూపంలో కమ్యూనికేట్ చేసుకునే నెట్‌వర్క్‌కి  ఫ్లయింగ్ అడహాక్ నెట్ వ‌ర్క్ అని పేరు పెట్టారు. ఈ సాంకేతికత  విపత్తు పరిస్థితుల్లో కీలకంగా మారుతోంది. భూకంపం, వరదలు, అగ్ని ప్రమాదం వంటి ఘటనల సమయంలో సాధారణ మొబైల్ నెట్‌వర్క్ పనిచేయక పోవచ్చు. అప్పుడు  డ్రోన్లు గాల్లో ఎగురుతూ సమాచారం సేకరించి పరస్పరం పంచుకుంటాయి. ఒక డ్రోన్ సేకరించిన డేటాను పక్కనున్న డ్రోన్‌కి పంపుతుంది. ముఖ్యంగా ప్రమాద ప్రాంతాల్లో మనుషులు వెళ్లడం కష్టమైన ప్రాంతాల్లో ఇది పెద్ద సహకారం అందిస్తోంది. కేల్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్  విభాగంలో పనిచేస్తున్న  ఆచార్య  ఎం.అనూష  పర్యవేక్షణలో తన పరిశోధన జరిగినట్లు  వివరించారు. కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్‌డి పట్టా పొందిన నవీన్ కుమార్ రెడ్డికి  శ్రీనిధి యాజమాన్యం, వీసీ ప్రొఫెస‌ర్‌ నరసింహారెడ్డి, డీన్ ఎం.కార్తికేయన్ , పలువురు  విభాగాధిపతులు  అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *