12న దేశవ్యాప్త కార్మిక సమ్మె

– విజయవంతానికి కృషి చేద్దామన్న దాస్యం

హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఈనెల 12న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని బీఆరఎస్ హనుమకొండ జిల్లా అధ్యÅ£ాTడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఉమ్మడి సన్నాహాక సమావేశాన్ని హనుమకొండలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మికులకు, ఉద్యోగులకు పనిభారం పెంచి, వేతనాలు తగ్గించి శ్రమ దోపిడీ చేసేందుకు పెట్టుబడిదారుల కుట్రలకు కేంద్రం వత్తాసు పలుకుతూ నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అసంఘటిత, సంఘటిత కార్మిక సంఘాలన్నీ కలిసి ఈనెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఐఎఫ్ టీయూ, ఏఐసీటీయూ, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *