28న జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ సంఖ్యలో రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం డిజిపి హైకోర్టు న్యాయమూర్తి కి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. తొలుత 14న జరగాల్సిన ఈ అదాలత్ 28వ తేదీకి పునఃషెడ్యూల్ అయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను తెలియజేశారు. అదాలత్‌కు 10 రోజుల ముందు నుంచే, అంటే మార్చి 19 నుంచి 27 వరకు ప్రతిరోజూ ‘డైలీ సిట్యుయేషన్ రిపోర్ట్ ద్వారా స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సీఐడీ విభాగాలు కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఈ నివేదికలో గుర్తించిన రాజీపడదగ్గ కేసులు, జారీ చేసిన నోటీసులు మరియు ప్రీ-లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది మార్చి 8న 1,83,182 కేసులు, జూన్ 14న 1,93,439 కేసులు, నవంబర్ 15 మరియు డిసెంబర్ 21న 1,79, 964 కేసులు(స్పెషల్ లోక్ అదాలత్ కలిపి) పరిష్కారమయ్యాయని, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ముఖ్యంగా పాత ట్రాఫిక్ చలాన్లు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నందున వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని, రాజీపడదగ్గ కేసులను ముందుగానే గుర్తించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామని డిజిపి తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రాసిక్యూషన్ అధికారుల సమన్వయంతో కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో శిఖా గోయల్, శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్, అడిషనల్ డిజిపి సిఐడి చారు సిన్హా, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *