21న జాతీయ రహదారుల దిగ్బంధం

– పత్తి, సోయాబీన్ పంటలను వెంటనే కొనాలి
– పత్తి రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– ఆదిలాబాద్ పత్తి మార్కెట్ సందర్శన

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 18: అన్న వాతలకు మద్దతుగా ఈ నెల 21న జాతీయ రహదారుల దిగ్బంధం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్నదాతలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతాంగం ముఖ్యంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆందోళ‌న చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి, సోయా రైతులను కలిసి వారి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలను రైతులు తెలియజే శారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతన్నలకు ఇచ్చిన హామీలన్నింటిని పక్కన పెట్టిందని, కనీసం పండిన పంటలను అమ్ముకోవ డంలో కూడా సహకారం అందించడం లేదని తెలిపారు. రైతన్నల సమస్యల పరిష్కారానికి పోరాటాలు మాత్రమే మార్గం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాల పోరాటాలను చేసేందుకు  తమ పార్టీ సంసిద్ధంగా ఉన్నది. పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది. మొన్న ఆత్మహత్య చేసుకున్న దీపక్ కుటుంబానికి పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం చేస్తాం. వెంటనే ప్రభు త్వం పంటల కొనుగోలు కోసం ఫింగర్ ప్రింట్ల నిబంధన, 12 శాతం తేమ ఉండాలన్న నిబంధన, ఎకరానికి ఏడు క్వింటాల మాత్రమే కొంటామన్న నిబంధనలన్నీటిని వెంటనే ఎత్తివేయాలి. కిసాన్ కపాస్ యాప్ సంబంధం లేకుండా పంట కొనుగోలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎందుకు ఈ రోజు అదిలాబాద్ మా ర్కెట్ యార్డ్ని బంద్ పెట్టారు. మార్కెట్ యార్డు లో రైతన్నలను కలుస్తామంటే ప్రభుత్వం ఎందు కు అడ్డంకులు కల్పించింది? చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణంగా పత్తి, సోయా రైతుల పరిస్థితి మారింది. కిసాన్ కపాస్ మొబై ల్ అప్లికేషన్ అని తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అంటున్నారు. కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటి? ఆదిలా బాద్ జిల్లాలో మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ అన్నిచోట్ల ఉండదు. మరి ఇలాంటి సందర్భం లో రైతన్నల పరిస్థితి ఏమిటో చెప్పాలి అని కేటీ ఆర్ అడిగారు. రాష్ట్రంలో అకాల వర్షా లు పడినందు వలన పత్తి తేమ శాతం ఎక్కువగా ఉన్నది. చలి కూడా గతంలో కంటే ఎక్కువగా ఉన్నది.. అందుకే పత్తిలో తేమ శాతం ఉన్నది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పై న ఒత్తిడి తీసుకొచ్చి 20 నుంచి 22 శాతం తే మ ఉన్న పంటను కూడా కొనిపించాం. కానీ ఇప్పుడు 12 శాతం తేమ ఉంటే కూడా కొనుగోలు చేయము అని చేతులు ఎత్తేసింది. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేరు కనీసం అడిగే వారు కూడా లేరు. ఇప్ప టిదాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొనలేదు. ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతుల పంటను దోచుకుంటున్నది అనీ కేటీఆర్ పేర్కొ న్నారు. కనీస మద్దతు ధర రూ. 8,100 రైతుకు దక్కాల్సింది కానీ ఐదారు వేలు కూడా దక్కడం లేదు. సోయాబీన్ అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. సొం త తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పంటలు బిడ్డలు అమ్మాలంటే కూడా కొనుగోలు చేయ డం లేదు. పత్తి పంట ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే ఒక అర్థరహి తమైన నిబంధన పెట్టారు. ఆదిలాబాద్లో ఉన్న భూసార పరిస్థితుల వలన పది పదిహేను క్విం టాళ్ల వరకు ఎకరానికి పండుతుంది మరి మిగి లిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి. ఈరోజు మేము రైతన్నలను కలవడానికి వెళ్తున్నామని తెలుసుకున్న ప్రభుత్వం నాటకాలు మొదలు:పెట్టారు అని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంతో -వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొద లుపెట్టారు. కానీ నిన్న జరిగిన క్యాబినెట్లో 50 శాతానికి పైగా తెలంగాణ జిల్లాలో పండుతున్న పత్తి పంట పైన కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెం -టు సరఫరా నుంచి మొదలుకొని యూరియా -సప్లై దాకా చివరికి పంట అమ్మకానికి సంబం ధించి కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతన్నలను పట్టించుకోవడం లేదు అని కేటీఆర్ -ధ్వజమెత్తారు. దేశంలో అద్భుతమైన నాణ్యత కలిగిన పత్తి పంట పండుతుంటే కేంద్రంలోని బిజెపి మాత్రం విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేయించుకుంటుంది. పైగా ఇప్పటిదాకా ఉన్న దిగుమతి సుంకాలన్నింటిని ఎత్తివేసింది. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతన్నలం దరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతన్నకు ఎకరానికి 20000 చొప్పున కనీస నష్టప -రిహారం చెల్లించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానిక బిజెపి, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకువచ్చి రైతన్నలకు న్యాయం చేయాలి. వెంటనే ఇక్కడి కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా స్థానిక రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి. లేకుంటే వారి పైన రైతన్నల పోరాటం తప్పదు. అని కేటీఆర్ హెచ్చరించారు.
అన్నదాతలకు అండగా ఉంటాం
నేరడిగొండలో కొనుగోలు కేంద్రాల పరిశీ లించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్సే అధి కారంలోకి వొస్తుంది.. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నామని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్షి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బాల్క సుమన్, దివాకర్ రావు, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page