దేశాభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర కీలకం

– రూ.30 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం
– రాష్ట్రంలో రూ. 550 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం
– రూ.860 కోట్లతో 422 కి.మి. రో రాష్ట్రానికి మంజూరు
– కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో రహదారులపై కిషన్‌ ‌రెడ్డి చర్చ
– కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లకు బిజెపి ఫోబియా పట్టుకుందని విమర్శలు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌25:  ‌దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర చాలా కీలకమని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి సరైన అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలతో తెలంగాణకు జాతీయ రహదారులు అనుసంధానం అయ్యాయని, జాతీయ రహదారుల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలియజేశారు. కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీతో సమావేశమై తెలంగాణ రహదారులపై చర్చించానని, రాష్ట్రంలో రూ. 550 కోట్లతో నూతన రహదారులకు నిర్మాణం చేపట్టాం అని పేర్కొన్నారు. రూ.860 కోట్లతో 422 కి.మి. రోడ్లను రాష్ట్రానికి మంజూరు చేశామని, రూ.30 వేల కోట్లకు పైగా నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందువరసలో నేనుంటాను.. మా మంత్రిత్వ శాఖలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం స్పెషల్‌ ‌సెల్‌ ఏర్పాటు చేసుకుని అన్నిరకాల అభివృద్ధి పనులను మానిటర్‌ ‌చేస్తున్నాను.. మా పార్టీ తెలంగాణ అభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేస్తుంది.. రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు, హైదరాబాద్‌ ‌మెట్రో విషయంలో అందరికంటే ముందే మేం ప్రొయాక్టివ్‌ ‌గా వ్యవహరించామని తెలిపారు. ట్రిపుల్‌ ఆర్‌కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.. మెట్రో విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతారు.. మెట్రో విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసినపుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్‌ ‌మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది.. అది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. దీన్ని వారే తేల్చుకోవాలి.. మెట్రో అంశానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుందని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పై సీబీఐ ప్రతిపాదనలు అందాయని, పరిశీలనలో ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుంది… రెండు పార్టీలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాయని, మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం ఇండిపెండెంట్‌ ‌గా ముందుకెళ్తాం.. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నాం.. బీసీ రిజర్వేషన్‌ ‌పెరగాలని అసెంబ్లీలో మద్దతిచ్చాం.. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదు. కాంగ్రెస్‌ ‌పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. 42శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.  ఇదే సందర్భంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌, ‌కేటీఆర్‌, ‌బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లతో బిజెపి ఎప్పుడు కలవదని స్పష్టం చేశారు. కలిసి కాపురాలు చేసింది.. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది.. మంత్రి పదవులు పంచుకుంది .. బిజెపికి ఎటువంటి అవసరం లేదని ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్వతంత్రంగా పోటీ చేస్తాం.. టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చేందుకే మా ప్రయత్నం చేస్తామని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి సమంజసంగా లేదు. జెన్‌ ‌జీ విషయంలో కేటీఆర్‌ ‌దేశద్రోహ వ్యాఖ్యలు.. నేపాల్‌లో జరిగినట్లుగా ఇక్కడ జరగాలని కేటీఆర్‌ ‌భావిస్తున్నారా? బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలవుతోంది.. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. అభివృద్ధి వేగవంతంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కొందరు దివాళాకోరు మాటలు మాట్లాడం సరికాదు. ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *