దిగుమతులు తగ్గించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ, మార్చి 18: క్రిటికల్ మినరల్స్ విషయంలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో 90 నుంచి 95% వరకు దిగుమతులపై ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో బుధవారం క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా విదేశాల్లోని క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను గవర్నమెంట్ టు గవర్నమెంట్ స్థాయిలో ఒప్పందాలు చేసుకుని అక్కడి మినరల్స్‌ను భారత దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికే అర్జెంటీనాతో లిథియం మైనింగ్‌కు సంబంధించిన ఒప్పందం పూర్తయిందని, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతోనూ ఒప్పందాలు పూర్తికానున్నాయని చెప్పారు. దీనికితోడు దేశంలో అర్బన్ మైనింగ్ ద్వారా చాలావరకు క్రిటికల్ మినరల్స్‌ను రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగం చేసుకోవచ్చునన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ కేంద్రాలకు అప్పగించాలని సూచించారు. దీనిపై ప్రతీ ప్రజాప్రతినిధి ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *