~ పది ట్రేడ్ యూనియన్ల మద్దతు
~ పాల్గొన్న 25కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు
న్యూదిల్లీి, జూలై 9: కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ట్రేడ్ యూనియన్ సంస్థలు బుధవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. ట్రేడ్ యూనియన్లకు రైతు సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని బహిష్కరించినట్లు సమాచారం. ఇక, కేరళలో బంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, షాపులు మూతపడ్డాయి. కోయికోడ్, మలప్పరం, కన్నూర్, కాసర్‌గడ్‌లలో బంద్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. రోడ్లు మొత్తం నిర్మానుషంగా మారాయి. ఒడిశా రాష్ట్రంలో సీఐటీ-యూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిరసనకారులు ఓ చోట రోడ్డుపై దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మిద్నాపూర్ బస్ట్ స్టేషన్‌ను సైతం ముట్టడిరచారు. బీహార్‌లో అయితే ఏకంగా రైల్వే ట్రాకులపైకి వచ్చి మరీ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జేడీ శ్రేణులు దర్భంగాలో నమో భారత్ రైలును ఆపేశాయి. ఇక, ముంబైలో భారత్ బంద్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలలో ట్రేడ్ యూనియన్ల బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు.





