చేనేత దంపతుల అద్భుత సృష్టి

– చీరలో మెరిసిన నారీశ‌క్తి
– మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆవిష్క‌ర‌ణ‌
– ఆడ‌బిడ్డ‌ల విజ‌యాల‌ను తెలిపే చేనేత చీర‌

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర మార్చి 7: మహిళా శక్తికి సంబంధించి సృజనాత్మకతను ప్రతిబింబించేలా హ‌రిప్ర‌సాద్ దంప‌తులు నేసిన చీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల శక్తి, సహనం, సాధనను ప్రతిబింబించేలా ఈ చీరను నేసి వీ తమ ప్రతిభను చూపించారు. సంప్రదాయ నేత‌ కళను ఆధునిక ఆలోచనలతో మిళితం చేస్తూ రూపొందించిన ఈ చీరలో మహిళల సాధికారతకు ప్రతీకగా పలు ఆకృతులు, రంగులను ఉపయోగించారు. చీరపై మహిళా సాధికారతను సూచించే ప్రతీకలు, సంప్రదాయ నమూనాలు, ఆకర్షణీయమైన రంగులతో అద్భుతంగా అలంకరించారు. దీనివల్ల నారీశక్తి యొక్క గొప్పతనం స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. ఈ దంప‌తులు తమ నైపుణ్యంతో నేసిన ఈ చీర‌ను, స్థానిక ప్రజలు మరియు కళాభిమానులు దీనిని ఎంతో అభినందిస్తున్నారు. ఈ చీర మహిళల సామర్థ్యాన్ని, సమాజంలో వారి ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నారీశక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఇలాంటి కళాకృతులు మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతు న్నారు. నారీ శక్తి ప్రతిబింబించేలా మూడు నెలల పాటు శ్రమించి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు హరిప్రసాద్ రేఖా దంపతులు ప్రత్యేకంగా చేనేత మగ్గం పై పట్టుచీర నేశారు. మ‌హిళ‌ల‌ విజయాలన్నీటిని ప్రతిబింబించేలా చేనేత చీరను నేశామ‌ని వారు
చేనే అన్నారు. మన దేశ గొప్పతనాన్ని చాటిన ఆడబిడ్డలు అందరికీ అభినందనలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన పట్టుచీరను నేసినట్లు తెలిపారు. మన దేశ మహిళలు సాధించిన విజయాలు ఆపరేషన్ సింధూర్ తో పాటు షూటర్ సుజిత్ సింగ్ ముఖచిత్రాలు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ మహిళా కబడ్డీ వరల్డ్ కప్ అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఆర్చర్  సీతల్ దేవి జ్యోతి చిత్రాలు నేసామన్నారు. ఒకే చీరపై ఇమిడే విధంగా నేశామ‌ని, మన దేశ మహిళల విజయాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి గుర్తుచేయాలని ఈ ప్రత్యేకమైన చీరను సిద్ధం చేశామన్నారు. ఈ చీర పై ఉన్న విజయాలను వారిని గుర్తు చేస్తూ వారికి అంకితం చేస్తున్నామనీ పేర్కొన్నారు.

మూడు నెల‌లు క‌ష్ట‌ప‌డ్డాం

నేను, నా భార్య దాదాపు మూడు నెలల పాటు కష్టపడి పట్టు చీరపై మన ఆడబిడ్డలు సాధించిన ఆపరేషన్ సింధూర్, షూటర్ సుజిత్ సింగ్ ముఖచిత్రం, మహిళల క్రికెట్ వరల్డ్ కప్, మహిళల కబడ్డీ వరల్డ్ కప్, ఆంధుల మహిళల క్రికెట్ వరల్డ్ కప్ అర్చర్ సీతల్ దేవి జ్యోతి చిత్రాలను నేశాం. మన ఆడబిడ్డల విజయాలను దేశ ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని భావిస్తున్నాను. ఈ అపురూపమైన చీరను  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయాలను చీరపై నేసి వారి విజయాలకు అంకితం చేయాలనుకుంటున్నాన‌ని హ‌రిప్ర‌సాద్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *