నానో యూరియాను పట్టించుకోని రైతాంగం

~ జిల్లాలో తీరని యూరియా తిప్పలు ` లైన్లో వేచి ఉంటున్న రైతులు
~ లోపించిన అవగాహన – కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
~ యూరియాతో పాటు నానో యూరియా జత చేసి విక్రయాలు

జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. యూరియా వస్తుందని తెలియగానే రాత్రి పగలు తేడా లేకుండా క్యూలైన్లలో వేచి ఉంటున్న రైతులు సాంప్ర దాయ యూరియాకు బదులు మార్కెట్లో సులభంగా లభిస్తున్న ప్పటికీ ఆ వైపుగా రైతులు కన్నెత్తి చూడడం లేదు. నానో యూరి యాపై తయారీదారులు విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉన్నప్ప టికీ కేవలం తయారు చేసి డీలర్లకు అప్పగించి చేతులు దులుపు కుంటున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 9 పిఎసిఎస్‌లతో పాటు 371పురుగు పురుగు మందులు, ఎరు వులు విక్రయించే షాపులు ఉన్నట్లు అధికారులు వెల్లడి స్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా వరి, పత్తి సాగు సాగు చేయగాఇప్పటి వరకు జిల్లాలో 18,750 మెట్రి ఓక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మరో ఐదు వేలు టన్నుల మేర యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా.

యూరియా కోసం తప్పని తిప్పలు

జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు వేల టన్నుల యూరియా దిగుమతి చేస్తున్నప్పటికీ రైతులకు సరిపడే విధంగా పంపిణీ కాకపోవడంతో యూరియా పంపిణీ చేస్తున్ననే సమాచారంతో రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. ఎండ వానలు లెక్కచేయకుండా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అధిక ధరలకు విక్రయాలు, యూరియాను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సరఫరా చేసిన యూరియా రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సంఘాలకు రూ. 266.50 లకు సరఫరా చేస్తుంది. ప్రైవేటు డీలర్లకురూ. 280 లకు సరఫరా చేస్తున్నప్పటికీ వాహనాల రవాణా చార్జీలను సంబంధిత డీలర్లు మాత్రమే భరించాల్సి ఉంటుంది. వీరు రవాణా చార్జీలతో కలిపి రూ.320 లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు .

జత చేసి విక్రయాలు

ప్రైవేట్‌ వ్యాపారులు యూరియా బస్తాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా నానో యూరియాను జతచేసి విక్రయిస్తు న్నారు. దీని వలన రైతులు తమ పెట్టుబడి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, సబ్‌ డీలర్లకు యూరియా బస్తాలతో పాటు నానో యూరియా బాక్సులను జతచేస్తూ విక్రయిస్తున్నారు. దీని వలన సబ్‌ డీలర్లు సాంప్రదాయ యూరియాను విక్రయించే క్రమంలో నానో యూరియాను లింక్‌ చేయడంతో కొనుగోలు లేక సబ్‌ డీలర్లు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సబ్‌ డీలర్లకు అందించిన కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు.

తయారు చేశారు .. ప్రచారం మరిచారు

నానో యూరియాను కోరమండల్‌ , ఇఫ్కో కంపెనీలు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీలు కేవలం తయారుచేసి డీలర్లకు అప్ప గించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెలువెత్తు తున్నాయి. తమ కంపెనీల ద్వారా నానో యూరియా తయారు చేయడంతో పాటు నానో యూరియా ప్రాధాన్యత, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంలో సంబంధిత సంస్థల సేల్స్‌ ఆఫీసర్లు,మేనేజర్లు విఫలం చెందారని విమర్శలు వెలివెత్తు ఙతు న్నాయి.ఈకంపెనీలు కాకుండా ఇతరయూరియా కంపెనీలు కూడాయూరియా సరఫరాలోనానో యూరియా లింకులుగా ఇస్తు న్నారు. నానో యూరియాను రైతులు పిచికారి రూపంలో ఇతర రసాయనమందులతో కలిపి చేయవచ్చునని ఆలోచనను రైతులలో కలిగించడంలోవిఫలంచెందారని పలువురు ఆరోపిస్తున్నారు.

నానో యూరియా పై అవగాహన కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

రైతులు పంటలకు నానో యూరియా వాడకంపై రైతులు అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచిస్తున్నారు. జిల్లాలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని గ్రామ స్థాయి నుండి ఫెర్టిలిజర్‌ షాపుల యజమానులు రైతులకు నానో యూరియా వాడకం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.  నానో యూరియా వాడకం వల్ల రైతులకు దిగుబడితో పాటు లాభం చేకూరుతుందని, జిల్లాలో యూరియా సరఫరా  జరుగుతుందని, ఇక ముందు రైతులకు  ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *