ఈడీ కస్టడీకి డాక్టర్‌ ‌నమ్రత

– సరోగసి అక్రమాలపై విచారణ
– కోర్టు ఆదేశాలతో విచారణకు సిద్దం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్‌ ‌నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్‌ ‌నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారణ జరగనుంది. ఈ కేసు సరోగసీ పేరుతో అక్రమాలు, హవాలా, మనీలాండరింగ్‌ ఆరోపణలతో సంబంధం ఉండటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డాక్టర్‌ ‌నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. అయితే కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం.. రెండు రోజుల పాటు మాత్రమే కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు ఈడీ అధికారులు డాక్టర్‌ ‌నమ్రతను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఈ రెండు రోజుల విచారణలో కేసుకు సంబంధించిన కీలక అంశాలను వెలికితీసే ప్రయత్నం చేయనున్నారు. డాక్టర్‌ ‌నమ్రతపై సరోగసీ సేవల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చట్టబద్ధమైన విధానాలను పాటించకుండా, అక్రమంగా సరోగసీ వ్యవస్థను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో ముఖ్యంగా హవాలా, మనీలాండరింగ్‌ అం‌శాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. డాక్టర్‌ ‌నమ్రత భారీ మొత్తంలో డబ్బు సేకరించి, హవాలా మార్గం ద్వారా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు లావాదేవీలు, బ్యాంక్‌ ‌ఖాతాలు, విదేశీ సంబంధాలు వంటి అంశాలపై ఈడీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు. ఈడీ కస్టడీ విచారణలో.. అక్రమంగా సేకరించిన డబ్బు తరలింపు మార్గాలు, ఇందులో పాల్గొన్న ఇతర వ్యక్తులు, విదేశీ సంబంధాలు వంటి అంశాలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారా అన్న దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరోగసీ వ్యవస్థను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *