– సూర్యాంశ్ అని పేరు
– కృతజ్ఞతలు తెలిపిన దంపతులు
– కృతజ్ఞతలు తెలిపిన దంపతులు
హైదరాబాద్ , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ లీడర్ లావణ్య, రాంబాబు దంపతులు. తమ కుమారుడికి పేరు పెట్టాలని పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు సోమవారం తమ బిడ్డను తీసుకువచ్చారు. తమ కొడుకుకు కేటీఆర్ పేరు పెట్టడం తమ జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన అని విన్నవించారు. ఈ అపూర్వమైన క్షణం తమకు అత్యంత గౌరవనీయమని వారు తెలిపారు. వారి విజ్ఞప్తికి భావోద్వేగానికి గురైన కేటీఆర్, ఆ చిన్నారి యోగక్షేమాల గురించి ప్రేమగా మాట్లాడారు. బాబుకు ఏ అక్షరంతో పేరు పెట్టాలని కేటీఆర్ అడిగినప్పుడు, తమ కుటుంబ సభ్యులకు ‘సు’ అనే అక్షరంతో పేరు పెట్టాలని బ్రాహ్మణులు సూచించిన విషయాన్ని రాంబాబు, లావణ్య దంపతులు కేటీఆర్‌కు తెలియజేశారు. దీనితో, తన కొడుకు హిమాన్షు పేరును గుర్తు చేసుకుంటూ, ‘సు’ అక్షరంతో ‘సూర్యాంశ్’ అనే పేరును ఆ చిన్నారికి కేటీఆర్ పెట్టారు. తమ కుమారుడికి కేటీఆర్ తన సొంత కొడుకు హిమాన్షు పేరు మాదిరిగానే సూర్యాంశ్ అని పేరు పెట్టడం అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని ఆ దంపతులు తెలిపారు. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం వారు తమ గ్రామానికి తిరిగి బయలుదేరి వెళ్లారు. వారికి కేటీఆర్ బహుమతిగా ఒక ‘కేసీఆర్ కిట్టు’ను అందించారు.
——————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



