-డీజీపీ శివధర్‌రెడ్డికి బీజేపీ ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 10వ వార్డులో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి డీఎస్పీ శివరామిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి వెళ్లినప్పుడు ఆయన రౌడీలా ప్రవర్తిస్తూ వీధిలో దాడి చేయడం, దుర్భాషలాడి కొట్టడం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై డాక్టర్ కల్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు శుక్రవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శివరామిరెడ్డిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిపై సమగ్ర విచారణ జరిపి అరెస్టుకు చర్యలు చేపట్టాలని, ఎన్నికల అక్రమాల రద్దుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు వెంటనే చేపడతామÁని డీజీపీ శివధర్ రెడ్డి బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




