మంచిరేవులలో నాగిరెడ్డి కుంట కబ్జా

– రంగంలోకి దిగి ఫెన్సింగ్‌ ‌వేసిన హైడ్రా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31: భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది.  ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్‌ ఎస్టేట్‌ ‌మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్‌ ‌పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు వద్ద రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలు చేస్తున్న భారీ అక్రమాలను హైడ్రా అడ్డుకుంది. చెరువు ఉనికిని మాయం చేసేందుకు చుట్టూ టిన్‌ ‌షీట్లు కప్పి లోపల కబ్జా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించి, చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలం అని తెలియజేస్తూ హైడ్రా బోర్డులను ప్రతిష్టించారు. ట్రాఫిక్‌ ‌సమస్యలకు ప్రధాన కారణమవుతున్న గండిమైసమ్మ-మియాపూర్‌ ‌ప్రధాన రహదారిపై హైడ్రా కీలక చర్యలు తీసుకుంది. 150 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన ఈ రహదారిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన 10 షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ ఆక్రమణల వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. అయితే, ఈ కూల్చివేతలు ఆకస్మికంగా కాకుండా, రెండు నెలల ముందే నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు హైడ్రా వెల్లడించింది. దీనితో ప్రయాణికులకు ట్రాఫిక్‌ ‌కష్టాల నుంచి విముక్తి లభించింది.ఘటకేసర్‌ ‌పరిధిలోని అవుషాపూర్‌లో 1440 గజాల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా రక్షించింది. ఒక లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న హైడ్రా బృందం వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ‌వేసి, ఇది ప్రభుత్వ పార్కు స్థలమని బోర్డులు ఏర్పాటు చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *