పరువు నష్టం కేసు ఉపసహరించుకున్న నాగార్జున

– మంత్రి కొండా సురేఖ క్షమాపణలతో..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ‌మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. గతంలో నాగచైతన్య- సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 అక్టోబరు 2024న హైదరాబాద్‌  ‌డియాతో మాట్లాడిన మంత్రి సురేఖ నాగచైతన్య-సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆరే కారణమంటూ చేసిన సంచలన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై సీరియస్‌ అయిన నటుడు  నాగార్జున పరువు నష్టం దావా కేసు వేశారు.  క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ ‌వేశారు. కేసుపై నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టు గురువారం విచారణ చేపట్టింది. అయితే కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో కేసును నాగార్జున విత్‌ ‌డ్రా చేసుకున్నారు. కాగా, ఇప్పటికే సోషల్‌ ‌మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి సురేఖ రెండుసార్లు క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలో మంత్రిపై వేసిన క్రిమినల్‌ ‌దావాను నాగార్జున ఉపసంహరించుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page