హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలల్లో మెరిట్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజుగా రూ.40 లక్షలకు చెక్కులను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట ఆధ్వర్యంలో ముత్తూట్ సీఎస్‌ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు పంపిణీ చేశారు. మొత్తం 21 మంది విద్యార్థులు లబ్ధిదారులుగా ఎంపికవ్వగా వారిలో పదిమంది ఎంబీబీఎస్, పదిమంది ఇంజినీరింగ్ విద్యార్థులు, ఒక నర్సింగ్ విద్యార్థి ఉన్నారు. సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు తమ విద్యను నిర్భయంగా కొనసాగించేందుకు అద్భుతమైన అవకాశం కలుగజేస్తున్నందుకు లయన్స్ క్లబ్ ప్రతినిధులను మంత్రి అభినందించారు.
విద్యార్థులకు ముత్తూట్ సీఎస్‌ఆర్ ఫౌండేషన్ సాయం



